దేశానికి గాంధీసిద్ధాంతమే శ్రీరామరక్ష : మంత్రి సీతక్క

దేశానికి గాంధీసిద్ధాంతమే శ్రీరామరక్ష :  మంత్రి సీతక్క
  • గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల్లో మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ఎప్పటికైనా దేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామరక్ష అని మంత్రి సీతక్క అన్నారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని గాంధీభవన్ లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు- స్వదేశీ మేళా జరిగింది. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. శాంతియుత మార్గంలోనే మనకు విజయం వరిస్తుందన్నారు. 

గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఏర్పాటు చేసి 50 ఏండ్లు పూర్తయిందని, గాంధీ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలి పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్​, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.