కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకో లేదంటే..: మంత్రి సీతక్క

కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకో లేదంటే..: మంత్రి సీతక్క

కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. వేములవాడ రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సీతక్క. కేటీఆర్ కి మైండ్ పని చేయక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు సీతక్క.మహిళలకు కల్పించిన ఉచిత బస్సు పథకాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని  మండిపడ్డారు.

కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేస్తే ప్రజలు గుర్తిస్తారని..లేదంటే  ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారని తెలిపారు మంత్రి సీతక్క.కేటీఆర్ కి ఇంకా దొర అహంకారం పోలేదని..రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ కే దక్కుతుందని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.