బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై.. కాంగ్రెస్ను అంతం చేయాలని చూశారు:సీతక్క

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై.. కాంగ్రెస్ను అంతం చేయాలని చూశారు:సీతక్క

హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై కాంగ్రెస్ను అంతం చేయాలని చూశారని మంత్రి సీతక్క అన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ను అంతం చేయాలనుకున్న కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టారనిచెప్పారు. దేశం కోసం గాంధీ కుటుంబం  ప్రాణత్యాగం చేసిందన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చి దేశం ప్రజలకోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీకి రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను గెలిచి బహుమతికి ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. 

మరోవైపు కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు. బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారని.. అభివృద్ది పేరుతో కాకుండా రామాలయం పేరుతో ఓట్లడుగుతున్నారని విమర్శించారు.గిరిజన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క .