
ఢిల్లీ: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ లో పైసా చట్టంపై జాతీయ సదస్సును నిర్వహించారు. పైసా చట్టం అమలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. గిరిజనాభివృద్ధి, చట్ట అమల్లోని ఇబ్బందులపై డిస్కషన్ చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు.. సెంట్రల్నుంచి వచ్చిన ఫండ్స్ని వినియోగించడంలో అటవీ శాఖ అధికారుల తీరుతో గ్రౌండ్చేయలేకపోతున్నామని తెలిపారు. దీంతో కేంద్ర ఇచ్చిన నిధులు కూడా ఏళ్ల కొద్ది పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు.
పదిరాష్ట్రాల్లో పైసా యాక్ట్అమల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రోడ్లు మౌలిక సదుపాయాల కల్పించడంలో కొన్ని ఫారెస్ట్ రూల్స్ఆటంకం కలిగిస్తున్నాయి. గ్రామ సభ ద్వారానే అభివృద్ధి ఏజెండాను నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలకు అధికారం ఇవ్వాలి. రాష్ట్రంలో హైడ్రా కు స్వయం ప్రతిపత్తి ఇచ్చాం. రాష్ట్రంలో పెద్దపట్టణాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ను తీసుకురావాలని డిమాండ్ వస్తుంది. కబ్జాదారులు కొంతమంది పేదలను ముందుపెట్టి వారి అక్రమ నిర్మాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ALSO READ | కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం
ప్రకృతిని కాపాడంతో హైడ్రా గొప్పగా పనిచేస్తుంది. కూల్చివేతలతో పేదలకు నష్టం కలగకుండా చూడాలని, వారిని ఆదుకునే దిశగా సీఎం నిర్ణయం తీసుకుంటున్నారు. పైసా యాక్ట్అమలు ఉన్న రాష్ట్రాల్లో గ్రామసభల తీర్మాణంతో అన్ని అనుమతులు తీసుకోవచ్చు. గ్రామసభల తీర్మాణమే ఫస్ట్అని పైసా యాక్ట్చెప్పుతున్నట్లుగా మంత్రి సీతక్క తెలిపారు.