ఏఐతో ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ నెక్స్ట్ లెవల్.. హాలీవుడ్‌‌కి ధీటుగా హైదరాబాద్ ఎదుగుతోంది: మంత్రి శ్రీధర్ బాబు

ఏఐతో ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ నెక్స్ట్ లెవల్.. హాలీవుడ్‌‌కి ధీటుగా హైదరాబాద్ ఎదుగుతోంది: మంత్రి శ్రీధర్ బాబు

‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని  సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో  దిల్ రాజు గారు 'లోర్వెన్ ఏఐ' స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ఈ  స్టూడియో ఎంటర్‌‌టైన్‌‌మెంట్ వరల్డ్‌‌ని నెక్స్ట్ లెవల్‌‌కి  తీసుకెళ్లాలని కోరుకుంటున్నా’ అని  తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.  నిర్మాత దిల్ రాజు ఏర్పాటు చేసిన  ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియో లాంచ్ ఈవెంట్‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘తెలంగాణ టెక్నాలజీ డ్రివెన్ స్టేట్. గత మూడు దశాబ్దాలుగా మనం లీడర్స్ ఆఫ్ టెక్నాలజీ అని ఈ వరల్డ్‌‌కి ప్రూవ్ చేసుకున్నాం. 

హాలీవుడ్‌‌కి ధీటుగా హైదరాబాదు ఎదుగుతోంది. చాలా సినిమాలు ఏఐ ఇంటిలిజెన్స్ ఆధారంగా వస్తున్నాయి. టెక్నాలజీతో కొత్త అవకాశాలు తెరపైకి వస్తాయి. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి.  మూవీస్ కూడా న్యూ ఫేజ్ ఆఫ్  ట్రాన్స్ఫర్మేషన్‌‌లోకి వెళ్తున్నాయి. దిల్ రాజు గారు ఈ విజన్‌‌తో రావడం చాలా ఆనందాన్నిచ్చింది’ అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఏఐ గురించి గత రెండేళ్లుగా డిస్కషన్ చేస్తున్నాం. మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం, క్వాంటంతో కలిసి సినిమా గురించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. కొత్తగా వచ్చేవారికి ఇదిచాలా ఉపయోగపడుతుంది. 

మా సంస్థలో రూపొందుతున్న విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ సహా పలు చిత్రాలకు ఏఐను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పారు.  ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్,  దర్శకులు రాఘవేంద్రరావు, వీవీ వినాయక్,  సుకుమార్, నాగ్ అశ్విన్, బాబీ,  వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి తదితరులు హాజరై ఈ స్టూడియో ఏర్పాటుపై  దిల్ రాజుని అభినందించారు.