గచ్చిబౌలి, వెలుగు: టెక్నాలజీకి అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో బుధవారం నాలుగో స్కిల్ స్నాతకోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లు కేటాయించిందన్నారు.
రోబోటిక్స్, ఏఐతో పాటు కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రిమోనిక్స్ తదితర రంగాల్లో యువతకు ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఇందుకోసం ఐఐటీ, ఐఎస్బీ, టాటా, టీసీఎస్ తదితర సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర రావు, చైర్మన్రవి కుమార్, ఎంజీఐటీ ప్రిన్సిపాల్ చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
మౌలిక వసతులకు నిధుల కొరత లేదు
గండిపేట: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మణికొండలో రూ.18.40 కోట్లతో నిర్మించిన కొత్త మున్సిపాలిటీ భవనం, రూ3.05 కోట్లతో నిర్మించిన అత్యాధునిక క్రికెట్ స్టేడియం గ్రౌండ్‌ను బుధవారం చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
అలాగే పందెంవాగుపై స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మణికొండను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు క్యాతం అశోక్‌యాదవ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
