బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ : మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ :  మంత్రి శ్రీధర్ బాబు

చేవెళ్ల, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని, కాళేశ్వరంతో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ  అయిందని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ తీసుకువచ్చిందని, తద్వారా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు.  రేపు చేవెళ్లలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా  సీఎం రేవంత్​రెడ్డి మరో 2 గ్యారెంటీలను రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) పథకాలను ప్రారంభించనున్నారు.  ఆదివారం చేవెళ్ల టౌన్ లోని కేజీఆర్ గార్డెన్ లో నిర్వహించిన  సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రియాంక గాంధీ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చేలా పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరో ఇరవై ఏండ్లు  కాంగ్రెస్ దే అధికారమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. 

మాజీ సీఎం కేసీఆర్ వలే ఇంట్లో కూర్చోని పాలన చేయబోమన్నారు. అలసత్వం వదిలి పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు.  డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి, పరిగి ఎమ్మెల్యే   రాంమోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే  మనోహర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి, చేవెళ్ల అసెంబీ ఇన్ చార్జ్ భీం భరత్, రాజేంద్రనగర్ అసెంబ్లీ ఇన్ చార్జ్ నరేందర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్ చార్జ్ జదీశ్వర్ రెడ్డి,  టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోష్న, కార్యదర్శి జనార్దన్ నెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్  అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ, జడ్పీటీసీలు జంగారెడ్డి,  ధారాసింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, నియోజకవర్గం నేతలు వసంతం, షాబాద్ దర్శన్, పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ నేత

 చేవెళ్ల మండల బీఆర్ఎస్   సీనియర్ నేత కుంచం శివకుమార్ గుప్త తన అనుచరులతో ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ పాలనలో పేదలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో కాంగ్రెస్ లో చేరినట్లు శివకుమార్ తెలిపారు.