
- బనకచర్లను ఒప్పుకునే ప్రసక్తే లేదు
పెద్దపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన చర్చలు జరిపి గోదావరి, కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు కృషి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్యలకు 9 ఆర్టీసీ బస్సులు, వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బనకచర్ల నిర్మాణానికి ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, కట్టిన నాలుగేండ్లకే కూలిపోయిందని విమర్శించారు.