హైదరాబాద్‌లో ఎంఈఐసీ ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్‌లో ఎంఈఐసీ ప్రారంభించిన మంత్రి  శ్రీధర్​బాబు
  • రూ.501 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్​, వెలుగు: మెడికల్ టెక్నాలజీ కంపెనీ మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్​ ఇన్నోవేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను (ఎంఈఐసీ) తెలంగాణ పరిశ్రమలు,  వాణిజ్య శాఖల మంత్రి శ్రీధర్​బాబు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించారు.  ఇది మెడ్​ట్రానిక్​కు యూఎస్​ వెలుపల మొదటి పెద్ద-స్థాయి ఐటీ కేంద్రం. దీనికోసం కంపెనీ 60 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ.501 కోట్ల) పెట్టుబడి పెడుతోంది.

 రాబోయే 3-–5 సంవత్సరాలలో 300 మందికి ఉపాధి కల్పించనుంది. ఐటీ క్లౌడ్ ఇంజనీరింగ్, డేటా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డిజిటల్ హెల్త్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, హైపర్ ఆటోమేషన్, ఏఐ/ఎంఎల్​వంటి అత్యాధునిక టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది.  క్లౌడ్ డెవ్​యాప్స్​, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ అనలిటిక్స్ అండ్​ విజువలైజేషన్, ఇంటిగ్రేషన్ అండ్​ మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్, ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ వంటి సేవలనూ అందిస్తుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రానిక్ భారీగా ఎదగడం చూసి థ్రిల్ అయ్యానని కామెంట్​చేశారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎంఈఐసీ   పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ విధానాల వల్లే మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రానిక్ వంటి ప్రఖ్యాత సంస్థలు తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నాయని అన్నారు. మెడికల్ టెక్నాలజీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని శ్రీధర్​బాబు హామీ ఇచ్చారు.