
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. గురువారం సెక్రటేరియెట్‌లో ఐటీ, ఇండస్ట్రీస్, లెజిస్లేటివ్ ఎఫైర్స్మినిస్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఆయన రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారంపై మండిపడ్డారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు. ఐటీ కంపెనీలు, ఇతర పెట్టుబడులు హైదరాబాద్‌నుంచి తరలిపోతున్నాయంటూ మీడియాకు లీకులు ఎలా ఇస్తారని ఐటీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు పోస్టింగ్‌లను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.
గడిచిన రెండ్రోజులుగా ‘కార్నింగ్స్’ అనే సంస్థ తెలంగాణను వీడి పోతున్నట్టుగా మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్ర వృద్ధిలో కార్నింగ్ప్రధాన భాగస్వామిగా ఉందని, మహబూబ్ నగర్జిల్లాలో ఎస్జీడీ ఫార్మాతో కలిసి ఆ సంస్థ గ్లాస్ట్యూబింగ్సంస్థను నెలకొల్పిందని తెలిపారు. కార్నింగ్సంస్థ రాష్ట్రంలో తమ రెండో ప్రాజెక్టుగా గొరిల్లా కవర్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. కార్నింగ్సంస్థ తమ పెట్టుబడుల విస్తరణపై ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదని ఏ రాష్ట్రంతోనూ ఆ సంస్థ ఎంవోయూ కూడా చేసుకోలేదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కార్నింగ్‌తో సంప్రదింపులు కొనసాగిస్తుందని, భవిష్యత్‌లోనూ ఆ కంపెనీ ఇక్కడ తమ పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తోందని వెల్లడించారు.