వరంగల్ అంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కువ

వరంగల్ అంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కువ

సీఎం కేసీఆర్ పట్టుదలతో కాకతీయుల చరిత్ర ప్రపంచానికి తెలిసిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వరంగల్ లో కాకతీయ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకతీయుల వారసుడు మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్,వినయ్ భాస్కర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్..  వరంగల్ అంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల వారసుడిని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. 

కాకతీయ గడ్డపై పుట్టినందుకు సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాకతీయుల పాలన ప్రభుత్వాలకు స్ఫూర్తి అని అన్నారు. కాకతీయుల ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని..గొలుసుకట్టు చెరువులను ఆదర్శంగా మిషన్ కాకతీయ చేపట్టామన్నారు. కాకతీయుల ఉత్సవాలు సీఎం ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు.  తమ వంశస్తుల గడ్డకు రావడం సంతోషంగా ఉందన్నారు కమల్ చంద్ర భంజ్ దేవ్. ప్రజలకు సేవ  చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినా బస్టర్ లో మాన్సేవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.