కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లే : హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లే :  హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లేనని మంత్రి హరీష్ రావు అన్నారు. 2023 జూన్ 1 గురువారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాకపోతే పల్లెలో ఇంత అభివృద్ధి జరిగేది కాదన్నారు. ఇప్పుడు ఎక్కడా బోర్ బండ్లు కనిపించడంలేదన్నారు. 

కాంగ్రెస్  హయాంలో రైతు కళ్ళలో కన్నీళ్లు తప్పా.. బోరు బావుల్లో నీటి చుక్క కూడా కనిపించేది కాదన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక రూ. 200 ఉన్న పెన్షన్ రూ. 2000 అయిందని తెలిపారు. ఇక ప్రజల అవసరాలు గుర్తించడంలో రాష్ట్ర సర్కార్ ముందుంటుందని చెప్పిన హరీష్.. అందుకోసమే సీఎం కెసిఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ఇక కార్యకర్తలను ఉదేశించి మాట్లాడిన హరీష్.. ఎప్పటికీ మీరే నా బలం, నా బలగం అని ఎమోషనల్ అయ్యారు.