మోహన్ బాబుకి కోపం ఎక్కువ.. కానీ..

V6 Velugu Posted on Oct 16, 2021

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించే విధంగా మా ఎన్నికలు జరిగాయని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంచు విష్ణు ప్యానెల్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన.. గెలిచిన అందరికీ అభినందనలు తెలిపారు. మా అసోసియేషన్ చిన్న ది కాదు..పెద్ద వ్యవస్థ అని అన్నారు. ఇంతమంది అభివృద్ధిని యువకుడు తన భుజాల మీద వేసుకున్నాడని తెలిపారు. తండ్రిగా మోహన్ బాబు విష్ణు కి మంచి సంస్కారం, విద్యా,క్రమశిక్షణ నేర్పించారని అన్నారు.

ఇండస్ట్రీలో అందరికీ తెలుసు...మోహన్ బాబు కి కోపం ఎక్కువ అని... ఆ కోపం కారణంగా పక్క వారికి నష్టం కలగలేదు కానీ, ఆయనకే నష్టం జరిగిందని తలసాని అన్నారు. మా ఇద్దరికీ చాలా ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నానని తెలిపారు. మంచి టీమ్ ను మా సభ్యులు ఎన్నుకున్నారని అన్నారు.

MAA కు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సహాయ,సహకారాలు అందిస్తుందని తెలిపారు మంత్రి తలసాని. రాష్ట్ర విభజన తర్వాత సింగిల్ విండో పద్దతి ద్వారా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి  శ్రీకారం చుట్టామని తెలిపారు. టికెటింగ్ కు ఇబ్బంది కలుగుతుంది అని... ఆన్ లైన్ టికెంటింగ్ వ్యవస్థ ను పరిచయం చేశామని అన్నారు.

Tagged Minister Talasani, Maa, government, provide assistance

Latest Videos

Subscribe Now

More News