
ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట్ డివిజన్, జీరాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జీరా బస్తీల్లో పర్యటించిన మంత్రి తలసానికి బస్తీలవాసులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇండ్లులేవని, ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న ఇండ్లు ఎప్పుడు కులుతాయో తెలియని పరిస్థితి ఉందని వివరించారు. బస్తీ వాసుల సమస్యలపై స్పందించిన మంత్రి.. ఎండోమెంట్ పరిధిలోని సమస్య అని.. వీలైనంత త్వరగా వారితో మాట్లాడి చూస్తామని పేర్కొన్నారు.