రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని టెంపుల్స్ గురించి మోడీ మాట్లాడారని...అసలు దేవాలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిగ్ధం  కొనసాగుతోందన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని..డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా అని నిలదీశారు.

బీజేపీ సభకు బల్కంపేట టెంపుల్ కి  వచ్చినంత మంది రాలేదని తలసాని అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోడీ ఒక్క సమాధానం ఇవ్వలేదన్నారు. టెక్స్ట్ టైల్ పార్క్, కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా అని అడిగారు. అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని.. సికింద్రాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి చేసిందేమిటో చెప్పాలన్నారు.  దేశంలో బీజేపీ ప్రభుత్వం పోతేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలుకాకపోతే బీజేపీ వాళ్లు రాష్ట్రంలో తిరిగేవాళ్లా అన్న తలసాని..బీజేపీ లాగ చిల్లర రాజకీయాలు చేయమని చెప్పారు.