గోషామహల్లో 9వేల మందికి పింఛన్ ఇస్తున్నం

గోషామహల్లో 9వేల మందికి పింఛన్ ఇస్తున్నం

దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లబ్దిదారులకు పింఛన్ అర్హత కార్డులను ఆయన అందజేశారు. గోషామహల్ నియోజకవర్గంలో మొత్తం 9వేల పింఛన్లు ఇస్తున్నామని.. కొత్తగా 3300మందికి నూతన పింఛన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

గతంలో 200 పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయేవారని.. కానీ కేసీఆర్ వచ్చాక ఆ తిప్పలు తప్పాయని తలసాని తెలిపారు. అర్హులైన వారు ఆన్లైన్ లో పింఛన్ కోసం అప్లై చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు సంతోషంగా పండుగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతో బతుకమ్మ పండుగకు చీరెలు పంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు.