విద్యకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత

విద్యకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వం ఇందుకు 7 వేలకోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు. ఖైరతాబాద్ లోని రాజ్ భవన్ స్కూల్, అమీర్ పేటలోని ప్రభుత్వ స్కూల్ లో  మనబస్తీ..మనబడి కార్యక్రమాన్ని దానం నాగేందర్ తో కలిసి ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో కిచెన్ డిజిటల్ ఎడ్యుకేషన్ తో పాటు.. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. జిల్లాలోని మొత్తం 690 పాఠశాలలు ఉండగా మొదటి విడుతలో భాగంగా 239 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 

పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్న తలసాని.. రాష్ట్రంలోని 26,065 పాఠశాలల్లో కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా అన్ని వసతులు కల్పించేకుగాను మన ఊరు-మన బడి, పట్టణాల్లో అయితే మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. మొదటి విడుతలో భాగంగా 9123 పాఠశాలల అభివృద్ధికి రూ.3,497 కోట్లు మంజూరు చేశారన్నారు.