మెట్ల బావి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి

మెట్ల బావి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి

చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకు రావడం కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.. ఎంజి రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు బన్సీలాల్ పేట డివిజన్ లోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.. పురాతన మెట్లబావికి అన్ని హంగులతో కూడిన మెరుగులు దిద్దుతున్నమన్నారు.

చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. మెట్ల బావి చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయడంతో పాటు లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు రెండు కోట్ల నిధుల వ్యయంతో కట్టడాలను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మెట్ల బావిలో ఉన్న నీటి మూలంగా భూగర్భ జలాల నీటి మట్టం కూడా పెరుగుతుందన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ప్రాచీన కట్టడాలకు శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.