త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ

త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు చేప పిల్లలను విడుదల చేశారు. అదేవిధంగా గౌరారం మండల కేంద్రంలో జాతీయ కృత్రిమ గర్భధారణ రెండో దశ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాలలో గొర్రెల షేడ్ లు నిర్మిస్తాం. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తాం. డీడీలు కట్టిన వారందరికీ గొర్రెలను పంపిణీ చేస్తాం. పాడిపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం. నరేగా కింద అర్హులైన వారందరికీ పశువుల, గొర్రెల షేడ్ లను మంజూరు చేస్తాం’అని ఆయన అన్నారు.

For More News..

అన్నా హజారేను తమతో కలవాలని కోరిన ఢిల్లీ బీజేపీ చీఫ్

దేశంలో 24 గంటల్లో 60,975 కరోనా కేసులు

మీఊర్లో ఎయిర్ పొల్యూషన్ ఎంతుందో తెలుసా?

రాష్ట్రంలో మరో 2,579 కరోనా పాజిటివ్ కేసులు