విద్య, వైద్యంపై సర్కార్ దృష్టి

విద్య, వైద్యంపై సర్కార్ దృష్టి

హైదరాబాద్: విద్య, వైద్యంపై రాష్ట్ర సర్కార్ ఎక్కువ దృష్టి పెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మితో కలిసి తలసాని శ్రీనివాస్ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి రూపకల్పన చేశారని... అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య, క్రీడల్లో శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో మొత్తం 687 పాఠశాలలున్నాయన్నా ఆయన... గ్రౌండ్ స్కూళ్లు జీహెచ్ఎంసీ గ్రౌండ్ ను ఉపయోగించుకుంటాయన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో విడతల వారీగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిరుద్యోగులకు కోచింగ్ తో పాటు మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

రాహుల్ పర్యటనపై నిర్ణయాన్ని వీసీకి వదిలేసిన హైకోర్టు 

SRH నుండి మరో క్రికెటర్ ఫేమస్.. అతని తండ్రి కూరగాయల వ్యాపారి