రాహుల్ పర్యటనపై నిర్ణయాన్ని వీసీకి వదిలేసిన హైకోర్టు 

రాహుల్ పర్యటనపై నిర్ణయాన్ని వీసీకి వదిలేసిన హైకోర్టు 

ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనపై నిర్ణయాన్ని హైకోర్టు వీసీకి వదిలేసింది. విద్యార్థులతో ముఖాముఖి కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించాలని ఆదేశించింది. పిటిషనర్ల అభ్యర్థనను వీసీ పరిగణలోకి తీసుకుంటారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓయూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటకు అనుమతించేలా ఆదేశించాలంటూ పిటిషనర్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవాదులెవరూ కోర్టుకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నిర్ణయాన్ని ఓయూ వైస్ ఛాన్సలర్ కు వదిలేసిన న్యాయస్థానం పిటిషన్ పై విచారణను ముగించింది. 

ఇదిలా ఉంటే హైకోర్టు ఆదేశాలకు ముందే ఓయూ వీసీ రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించేందుకు నిరాకరించారు. పలు కారణాల దృష్యా మీటింగ్కు అనుమతించలేమని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

రాహుల్ సభను విజయవంతం చేయండి

ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ