సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ 

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ 

మెదక్: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. గురువారం కలెక్టరేట్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఆ పథకాలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పేట వేస్తోందన్న మంత్రి... కాళేశ్వరం వంటి మహా ప్రాజెక్టులతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారిందన్నారు. రైతు బంధు, రైతు బీమా,  దళిత బంధు, కల్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ పథకం, డబుల్ బెడ్రూం ఇళ్లు, మన ఊరు మన బడి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాలతో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.  

పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో మరిన్ని వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శ్రీ పథకం అమలుజేస్తున్నామని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో టీఎస్ ఐపాడ్ ఓ సంచలనం అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

కేసీఆర్ పాలనలో రాష్ట్రం ముందడుగు

గవర్నర్ గా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా