
డబ్బు చాలామంది సంపాదిస్తారు. కాని దానిని తోటి వారికి ఉపయోగపడేలా చెయ్యడం కొంతమందే చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని ఆపిల్ హోమ్ అర్ఫన్ కిడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి లోగోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఎంతో మంది తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి సహాయం చేయడానికి మంచి చొరవ తీసుకున్న ఆపిల్ హోమ్ కు అభినందనలను తెలిపారు. హోమ్ కు సహకరించిన GHMC కి కూడా తలసాని ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తన వంతు సాయంగా ఆర్ఫాన్ హోమ్ కు 5 ఫ్రిడ్జ్స్ ఇస్తానని ఆయన అన్నారు.
షి నీడ్ కార్యక్రమం 100ప్రాంతాల్లో చెయ్యడానికి చేస్తున్న ప్లాన్ బాగుందని మంత్రి తలసాని ఈ సందర్భంగా అన్నారు. 2.5లక్షల రూపాయలు స్వంతంగా ఇస్తానని, ఇతరులతో కూడా హెల్ప్ చేయిస్తానని ఆయన అన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి సహకరించాలని తలసాని అన్నారు.
వర్షం కష్టాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో ఉన్నా.. మీడియా మాత్రం హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నట్టు చూపుతోందని మంత్రి ఓ సందర్భంలో అన్నారు. హైదరాబాద్ లో వాటర్.. కరెంట్.. లా అండ్ ఆర్డర్.. రోడ్… వంటి మౌలికమైన సదుపాయాలు కల్పించామని తలసాని తెలిపారు.