
రుణమాఫీ రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఆగస్టు 14న లక్షన్నర నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంత వరకు ఏ రాష్ట్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు.
రుణమాఫీ కానీ రైతులు అధికారులకు కంప్లైట్ చేయొచ్చని చెప్పారు తుమ్మల. రుణమాఫీ కానీ రైతులు వివరాలు ఇవ్వాలని సూచించారు. రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూ ఉంటే క్లియర్ చేస్తామని చెప్పారు.కేంద్రప్రభుత్వం కూడా రైతుల్నిపట్టించు కోలేదన్నారు తుమ్మల. రైతు చట్టాలతో కేంద్రం ఇబ్బంది పెట్టిందన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.
రైతుల పేరు మీద బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు తుమ్మల. రుణమాఫీపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు. అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందన్నారు. 2022లో ఎన్నికల ముందు భూములు అమ్మి రుణమాపీ చేశారని చెప్పారు. గత సర్కార్ రుణమాఫీ పేరుతో రైతుల్ని ముంచిందన్నారు తుమ్మల. రైతు బీమా స్కీంను కంటిన్యూ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పనికి మాలిన రాజకీయాలు బంద్ చేసుకోవాలని సూచించారు తుమ్మల.