గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి చొరవ తీసుకోండి ..కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి చొరవ తీసుకోండి ..కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసిన  మంత్రి తుమ్మల

సుజాతానగర్, వెలుగు : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ త్వరగా నిర్మించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై మంత్రి తుమ్మల చర్చించారు. 

ఫీజిబులిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనువుగా లేనందున మరో చోట స్థలాన్ని చూపినట్టు తెలిపారు. అక్కడ త్వరగా ఫీజిబులిటీ సర్వే చేసి, ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తుమ్మల మంగళవారం ప్రకటనలో తెలిపారు.