50వేల టన్నుల యూరియా ఈ వారంలోనే పంపించండి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

50వేల టన్నుల యూరియా ఈ వారంలోనే పంపించండి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రకటించిన 50వేల టన్నుల యూరియాను ఈ వారంలోనే అందేలా చూడాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్​లో చేసిన నిరసన ప్రదర్శనల కారణంగానే కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్​కు కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 

ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. ‘‘కర్నాటక నుంచి 10,800 టన్నుల యూరియా ఫస్ట్ షిప్‌‌మెంట్ ప్రారంభమైంది. ఈ వారంలో మరో 3 షిప్‌‌మెంట్ల ద్వారా మిగతా మొత్తం సరఫరా చేయాలని డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆదేశాలిచ్చింది. ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంది. జాప్యం లేకుండా సరఫరా చేయాలని కోరాం.” అని తుమ్మలపేర్కొన్నారు.