- అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ దొంగలు నట్టేట ముంచారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడంతో ఇప్పుడు మైండ్ కూడా పనిచేయట్లేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడం.. జూబ్లీహిల్స్‌లో బావ–బామ్మర్ది కుట్రలకు ప్రజలు బుద్ధి చెప్పడంతో ఏం మాట్లాడాలో చేతగాక విద్యుత్ ప్లాంట్లపై అవినీతి అంటూ ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారని బుధవారం ప్రకటనలో మంత్రి విమర్శించారు.
బీఆర్‌ఎస్ లీడర్ల వేషాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మూసీలో కంపు పారదోలి గోదావరి నీళ్లు తీసుకొస్తామంటే.. ‘లక్ష కోట్ల అవినీతి’ అంటాడు బామ్మర్ది! సిటీకి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్‌లో పరిశ్రమల భూములను కన్వర్షన్ చేసుకునేందుకు ప్రభుత్వం జీవో ఇవ్వకముందే ‘రూ.5 లక్షల కుంభకోణం’ అంటున్నాడు.
బామ్మర్ది కంటే నేనేం తక్కువనా!’ అన్నట్టు బావ రూ.50 వేల కోట్ల కుంభకోణం అని మరో అబద్ధం ఎత్తుకున్నడు” అని మంత్రి పేర్కొన్నారు. ఇష్టమొచ్చిన ధరలకు విద్యుత్ కొని, అవినీతికి పాల్పడి తెలంగాణ డిస్కంలను రూ.90 వేల కోట్ల అప్పుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ముంచిందని పేర్కొన్నారు.
