
- అగ్రికల్చర్ మినిష్టర్ తుమ్మల నాగేశ్వరరావు
ములకలపల్లి/అశ్వారావుపేట, వెలుగు : జిల్లాలోని ప్రతి స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్, డీఎంహెచ్‌వో జయలక్ష్మిని అగ్రికల్చర్ మినిష్టర్తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో మంత్రి పర్యటించారు. స్వస్త్ నారీ– సశక్త్ పరివార్అభియాన్లో భాగంగా మంగపేట పీహెచ్సీలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. కోయ భాష, ఆదివాసీ మహిళలతో కొంతసేపు మాట్లాడారు.
అనంతరం మూకమామిడి గ్రామంలోని ఏకలవ్య స్కూల్‌ను సందర్శించారు. స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య స్కూల్లో కొత్తగా నిర్మించిన కంప్యూటర్‌ల్యాబ్ బేస్డ్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అదనపు క్లాస్ రూం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పట్వారిగూడెంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి అంగన్వాడీ టీచర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తోందన్నారు.
ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కలెక్టర్జితేశ్ వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహూల్, డీఎంహెచ్‌వో జయలక్ష్మి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్రవిబాబు, ఐసీడీఎస్ పీడీ స్వర్ణలత లెనినా, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, కాంగ్రెస్నాయకులు తాండ్ర ప్రభాకర్, పర్వతనేని అమర్ నాథ్, పువ్వాల మంగపతి, బత్తుల అంజి, తిరుపతిరెడ్డి, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.