మంత్రి తుమ్మల ఫోన్‌‌ మిస్‌‌

మంత్రి తుమ్మల ఫోన్‌‌ మిస్‌‌
  • మహిళా సంఘం లీడర్‌‌కు దొరకడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు

శంకరపట్నం, వెలుగు : రేషన్‌‌ కార్డుల పంపిణీకి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌‌ మిస్‌‌ అయింది. చివరకు ఓ మహిళా సంఘం లీడర్‌‌ వద్ద ఉన్నట్లు తెలియడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌ జిల్లా శంకరపట్నంలో సోమవారం నిర్వహించిన రేషన్‌‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఇన్‌‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ క్రమంలో తన ఫోన్‌‌ను అక్కడే టేబుల్‌‌పై పెట్టి మర్చిపోయారు.

 ఓ మహిళా సంఘం లీడర్‌‌ ఫోన్‌‌ను గమనించి... తమ సంఘం సభ్యుల్లో ఎవరిదైనా అయి ఉంటుందన్న ఉద్దేశంతో తమ వాట్సప్‌‌ గ్రూప్‌‌లో వాయిస్‌‌ మెసేజ్‌‌ పెట్టారు. ఎవరూ స్పందించకపోవడంతో ఆ మహిళ సెల్‌‌ఫోన్‌‌ను తనవద్దే పెట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు కాల్‌‌ చేయడంతో ఫోన్‌‌ తన వద్దే ఉందని చెప్పగా... కేశవపట్నం ఎస్సై శేఖర్‌‌రెడ్డి సిబ్బందితో వెళ్లి ఫోన్‌‌ను స్వాధీనం చేసుకుని మంత్రికి అందజేశారు.