కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి కోరారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడుకు చెందిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు జోగు అరవింద్ రెడ్డితోపాటు 50 మంది నాయకులు శనివారం కాంగ్రెస్​లో చేరారు. వారికి హైదరాబాద్​లో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.