రైస్ మిల్లింగ్​లో లేటెస్ట్​ టెక్నాలజీ వాడాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైస్  మిల్లింగ్​లో లేటెస్ట్​ టెక్నాలజీ వాడాలి  :  ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తం
  • హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16వ ఇంటర్నేషనల్​ రైస్, గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో

హైదరాబాద్​, వెలుగు : రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16వ ఇంటర్నేషనల్ రైస్, గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ నాణ్యమైన బియ్యం ఉత్పత్తిలో రాష్ట్రం నంబర్ వన్​గా ఎదగడానికి మిల్లర్లకు పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. మిల్లింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టెక్నాలజీ అప్​గ్రేడ్​పై మిల్లర్లు దృష్టి సారించాలన్నారు.

కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్గొండ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తనకు రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైస్ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాన పరిశ్రమగా గుర్తించి, 2-3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. మిల్లింగ్ చార్జీలు, రవాణా చార్జీలు వంటి సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.