మక్తల్ , వెలుగు : మక్తల్ లో 150 బెడ్ల ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన ఆస్పత్రి పనులను పరిశీలించారు. నవంబర్ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా రోడ్డు ఉండాలని సూచించారు.
ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. అలాగే మక్తల్ అనుగొండ రోడ్డు నుంచి ఆసుపత్రికి రోడ్డు మార్గం కల్పిస్తామని చెప్పారు. డిసెంబర్లో ఆసుపత్రిని ప్రారంభించాలనే లక్ష్యం పెట్టుకోవాలన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు కట్టా సురేశ్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, వాకిటి హన్మంతు, కావాలి తాయప్ప, ఫయాజ్ ఉన్నారు.
