యువతలో నైపుణ్యం పెంచాలి .. కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉపాధి కల్పించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

యువతలో నైపుణ్యం పెంచాలి .. కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉపాధి కల్పించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మల్లేపల్లిలోని ఏటీసీ, ఐటీఐల పరిశీలన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్​గా తీర్చిదిద్దాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కొత్త కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉద్యోగాలు వచ్చేలా అధికారులు కంపెనీలతో చర్చలు జరపాలని సూచించారు. యువతలో నైపుణ్యం పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఏటీసీ, ఐటీఐని మంత్రి వివేక్ గురువారం పరిశీలించారు. క్యాంపస్​లో ట్రైనింగ్ తీసుకుంటున్న వారితో ఇంటరాక్ట్ అయ్యారు. 

ఏటీసీ, కోర్సులు, అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, జేడీ నగేశ్, రీజినల్ డైరెక్టర్ రాజాతో కలిసి రివ్యూ చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో పరిశ్రమలతో పాటు సింగరేణి సంస్థ ఉందని, అక్కడి ఏటీసీ, ఐటీఐ విద్య పూర్తి చేసిన వారికి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఏటీసీలకు టాటా ఫౌండేషన్ సహకారం మరువలేనిదని, వచ్చే ఏడాది ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలని కోరుతామని మంత్రి తెలిపారు.