డిసిప్లిన్ ఉన్నవాళ్లే లైఫ్ లో సక్సెస్ అవుతారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో కాకా మెమోరియల్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లా కాలేజీ ప్రిన్సిపల్ సృజన, జాయింట్ సెక్రటరీ రమణ, సీఈఓ లింబాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంబేద్కర్ లా కాలేజీలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ లో ప్రెసిడెంట్ హోదాలో ప్రసంగించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ ఎకానమీ, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సమస్యలు, వారి భద్రత, సామాజిక రక్షణ అంశాలపై మంత్రి ప్రసంగించారు. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కార్మికులు ఎదుర్కొంటున్నభద్రతా లోపాలు, హక్కుల అంశాలను ప్రస్తావించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ భద్రత, రక్షణ చట్టం గురుంచి మోక్ పార్లమెంట్ లో విద్యార్థులకు వివరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్..లా విద్యార్థులు మంచి మార్గాన్ని ఎంచుకున్నారు..లా సమస్యలు చాలా ఉన్నాయన్నారు. న్యాయవ్యవస్థలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని.. లా స్టూడెంట్స్ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ చదవాలని సూచించారు వివేక్.
లాయర్ కు క్రెడిబిలిటీ కీలకమని.. క్రెడిబిలిటీ నిలుపు కోవాలని సూచించారు మంత్రి వివేక్. ప్రత్యర్థి లాయర్ చిన్న చిన్న విషయాలు తీస్కొని కూడా మళ్ళీ కేసులు రీ ఓపెన్ చేస్తారని గుర్తు చేశారు. ప్రెసెంటేషన్ స్కిల్స్ ముఖ్యమైనవన్నారు. ఈ మోక్ పార్లమెంట్ లా స్టూడెంట్స్ కు మంచిగా ప్రెసెంట్ చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. రెగ్యులర్ గా స్కిల్స్ పెంచుకొని మాట్లాడుతూ ఉండాలని.. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేయాలని సూచించారు వివేక్.
