చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని.. అందుకు పార్టీ కార్యకర్తలు, లీడర్లు సమష్టిగా కృషి చేయాలని కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి. సమస్యలు తీరు తాయని భావిస్తూ ప్రజలు హస్తంపార్టీలో చేరు తున్నారని స్పష్టం చేశారు. మంత్రి వివేక వాళ మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు ఆఫీస్ ను సందర్శించారు.
నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ ఆశావాహులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కొమ్మెర మాజీ సర్పంచ్ తాళ్లపెల్లి సత్యనారాయణగౌడ్ తో పాటు చెన్నూరు. కో టపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, రాష్ట్ర కార్మిక, గను లశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధిపట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పలువురు స్పష్టం చేశారు.
