
హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రాలో CII ఇండియన్ విమెన్ అప్ లిఫ్ట్, వాయిస్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. మహిళా పారిశ్రామికవేత్తల కోసం CII ఎంతగానో కృషి చేస్తోందని.. ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తోందని అన్నారు మంత్రి వివేక్.దేశ జీడీపీ పెరగాలంటే మహిళా వ్యాపారవేత్తలు కావాలని.. మహిళా పారిశ్రామికవేత లకు ధైర్యం ఎక్కువ అని అన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలు మల్టీ టాస్కింగ్ గా ఉంటారని.. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న మహిళలకు అవకాశాలు ఇవ్వాలని అన్నారు. మహిళల సూచనల చాలా విలువైనవని...ప్రోత్సాహం అందించాలని అన్నారు మంత్రి వివేక్.ఇల్లు వ్యాపారం చూసుకోవడం సులభం కాదని.. తన కుటుంబంలో ఉన్న మహిళలు కూడా మంచి పారిశ్రామిక వేత్తలుగా ఉన్నారని అన్నారు. మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు మంత్రి వివేక్.
ALSO READ : బంగాళాఖాతంలో ద్రోణి.. తీరం దాటనున్న అల్పపీడనం..
బిజినెస్ ను ఛాలెంజింగ్ గా తీసుకొని రూ. ఐదు లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేశానని.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక వ్యాపార బాధ్యతలు తన సతీమణి సరోజకు అప్పగించానని అన్నారు. తన అభివృద్ధిలో సరోజ పాత్ర వెలకట్టలేనిదని అన్నారు మంత్రి వివేక్. తప్పుడు నిర్ణయాలు జీవితానికి పాఠాలు నేర్పిస్తాయని..కుటుంబాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయద్దని అన్నారు మంత్రి వివేక్.