జూబ్లీహిల్స్ లో లక్ష మెజారిటీ.. వన్ సైడ్ ఎలక్షన్ అని ప్రజలే చెప్తున్నారు : మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్ లో లక్ష మెజారిటీ.. వన్ సైడ్ ఎలక్షన్ అని ప్రజలే చెప్తున్నారు : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి
  • షేక్ పేట డివిజన్ లో పాదయాత్ర

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ వన్ సైడ్ జరగనుందని నియోజకవర్గంలోని ప్రజలే చెప్పుతున్నట్లు వెల్లడించారు. జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికలో భాగంగా షేక్పేట డివిజన్ లో ఆయన ఇవాళ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఇక్కడికి 20 రోజుల క్రితం వచ్చినప్పుడు ప్రజలు అనేక సమస్యలు చెప్పారని గుర్తు చేశారు. 

ముఖ్యంగా నాలా, కమ్యూనిటీ హాల్, రోడ్లు, డ్రైనేజీ వంటిసమస్యలు కనిపించాయన్నారు. రూ.1.50 కోట్లో ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగు తున్నాయని, అదే విధంగా కమ్యూనిటీ హాల్ కోసం మరో రూ.20 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే పనులు కూడా వేగంగాజరుగుతున్నాయని చెప్పిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అభివృద్ధి కనిపిస్తుందని ప్రజలు అంటున్నారన్నారు. ఒక బాకీ కార్డు తయారు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి తప్పిన హామీలపై ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు.