
చెన్నూర్ పట్టణంలోని 14వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం ( సెప్టెంబర్ 13 ) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఈరోజు 14వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
దసరా తరువాత కోటి రూపాయల నిధులతో 14వ వార్డులో అభివృద్ధి పనులను చేపడతామని.. చెన్నూర్ నియోజకవర్గంలో 100కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. సుమారు రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. తమ కాలనీకి రోడ్డు పనులు ప్రారంభించినందుకు మంత్రి వివేక్ కు కృతఙ్ఞతలు తెలిపారు కాలనీవాసులు