బీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారు: మంత్రి వివేక్

బీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారు: మంత్రి వివేక్

జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్ పేట్ డివిజన్ లో డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం ( అక్టోబర్ 25 ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్.షేక్ పేట్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి మంచి రెస్పాన్స్ వస్తుందని.. అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ , గాలిలో కుస్తీ చేస్తున్నాయని అన్నారు.

మున్నూరు కాపు, గంగపుత్ర సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యామని.. పూర్తిస్థాయిలో కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తామని చెప్పారని తెలిపారు మంత్రి వివేక్. మైనార్టీలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అన్నారు. 

గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందని.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తోందని అన్నారు మంత్రి వివేక్.

బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పై ఫేక్ ప్రచారం చేస్తున్నారని..కాంగ్రెస్ పై చేస్తున్న దుష్ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు మంత్రి వివేక్.