గ్రామీణ యువతను క్రికెటర్లుగా ప్రోత్సహించాలి :మంత్రి వివేక్ వెంకటస్వామి

గ్రామీణ యువతను క్రికెటర్లుగా ప్రోత్సహించాలి :మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రికెటర్లుగా ప్రోత్సహించాలని మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు.రాష్ట్ర లేబర్, ఎంప్లైమెంట్ ట్రైనింగ్, ఫ్యాక్టరీస్, మైన్స్ శాఖ మంత్రిగాబాధ్యతలు తీసుకున్న సందర్భంగా  సికింద్రాబాద్ క్లబ్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామికి సన్మానం చేశారు. శివాలాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు hca సభ్యులు పాల్గొన్నారు. Hca అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన మంత్రి వివేక్ వెంకటస్వామిని అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 

గతంలో హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. Hca అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. స్టేడియం పనులు ప్రారంభించినప్పుడు కోటి రూపాయల విరాళం ఇచ్చి నిర్మాణానికి వివేక్ వెంకటస్వామి సహకరించారు. 

ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియం నిర్మాణం విషయం లోవిశాఖ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసింది. స్టేడియం నిర్మాణం పూర్తయ్యాక gmr ఇతర సంస్థలు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చాయని గుర్తుచేశారు. HCA ఎప్పుడు హై స్టాండర్డ్ లో ఉండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు  వివేక్ వెంకటస్వామి.

మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. సహాయం చేయడంలో కాకా వెంటకస్వామి ఫ్యామిలీ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. Hca అభివృద్ధి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అభివృద్దఇలో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు.