- మెదక్, సిద్దిపేట, చెన్నూరు నేతలకు మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ
హైదరాబాద్, వెలుగు: స్థానిక ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను పరిష్కరిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మెదక్, సిద్దిపేట, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, నేతలు హైదరాబాద్ సోమాజిగూడలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. చెన్నూరు మండలంలోని చింతలపల్లి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి, మామిడి రాజు.. మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు బొమ్మల యాదగిరి కొత్త కారును మంత్రి వివేక్ డ్రైవ్ చేసి కంగ్రాట్స్ చెప్పారు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్యతో కలిసి మాలమహానాడు 2026 క్యాలెండర్ ను మంత్రి అవిష్కరించారు. ఎస్సీ ఉపకులాల జేఏసీ చైర్మన్ బైరి వెంకటేశ్ మంత్రికి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
