మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 1,2 వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ... వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డుల్లో బోర్లు, పారిశుధ్య సమస్యలను వివరించారు వార్డు ప్రజలు. వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే వార్డులలో నూతన సీసీ రోడ్లు, బోర్లు వేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే చెన్నూరు మున్సిపాలిటీలో రూ.50 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు మంత్రి వివేక్. చెన్నూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
