ఏసు ప్రభువు బోధనలు ప్రపంచానికి మార్గం చూపాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మందమర్రి, రామకృష్ణపూర్ సిఎస్ఐ,సీయోను,పెంతేకాస్తు చర్చ్ లలో మంత్రి వివేక్ వెంకటస్వామి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ , నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి వ్యక్తి సన్మార్గంలో భక్తి భావనతో ప్రార్థనలు చేయాలని సూచించారు.
పేదలకు సాయం అందిస్తూ వృద్ధులకు తోడ్పాటు అందించాలన్నారు. ఏసు ప్రభువు బోధనలను కాకా వెంకటస్వామి స్పూర్తిగా తీసుకొని కష్టాల్లో ఉన్న పేద వాళ్ళకు వృద్ధులకు సాయం అందించేవారన్నారు. కాకా ఆశయాన్ని తమ కుటుంబం కొనసాగిస్తుందన్నారు వివేక్. అన్ని కులమతాలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో చర్చ్ ల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు వివేక్.
