పిచ్చుకలు తగ్గడం మనకో హెచ్చరిక : మంత్రి వివేక్ వెంకటస్వామి

పిచ్చుకలు తగ్గడం మనకో హెచ్చరిక : మంత్రి వివేక్ వెంకటస్వామి

పర్యావరణ సమతుల్యతలో పిచ్చుకలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంఖ్య తగ్గడం మన సమాజానికి, పర్యావరణానికి ఒక హెచ్చరిక అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలంతా చెట్లను నాటడం, పక్షులకు ఆహారం, నీరు అందించే అలవాటు పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా బండ్లగూడ సన్ సిటీలోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్​ను శనివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన సతీమణి సరోజా వివేక్ కూడా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. - వెలుగు, గండిపేట