
సినీ కార్మికులకు అండగా ఉంటామన్నారు మంత్రి వివేక్. రవీంద్రభారతిలో తెలంగాణ మూవీ టీవీ & డిజిటల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాయకులు మంత్రి వివేక్ కు సన్మానం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తరపున సినీ కార్మికులకు భరోసా కల్పిస్తామన్నారు. త్వరలోనే సినీ కార్మికులతో మరో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కార్మిక శాఖ మంత్రిగా ప్రభుత్వం నుంచి ఎదో ఒక లాభం జరిగేలా చూస్తానని చెప్పారు వివేక్.
ఆర్టిస్ట్ పెన్షన్ కోసం ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడుతానని చెప్పారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్టర్ కు కూడా లెటర్ రాస్తామన్నారు. ఒకటే యూనిన్ గా ఉండి కొట్లాడాలని ఆర్టిస్తులకు విజ్ఞప్తి చేశారు మంత్రి వివేక్. సినీ కార్మికులకు కావాల్సిన ఆఫీస్ బిల్డంగ్ కోసం కలెక్టర్ కు లేక రాస్తానని.. సీఎంకు కూడా చెప్తానన్నారు. సినీ కార్మికుకు ఆఫీస్ ను ఏర్పాటు చేస్తామన్న వివేక్.... ఆరోగ్యశ్రీ అంశం సీఎం దృష్టకి తీసుకెళ్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళు కావాలని చాలా మంది అడుగుతున్నారని.. జూబ్లీహిల్స్ లో దీనిమీద తొందలోనే చర్చిస్తామన్నారు వివేక్.
►ALSO READ | సుప్రీం తీర్పును అమిత్ షా వక్రీకరించడం సరికాదు: రిటైర్డ్ జడ్జీలు