సుప్రీం తీర్పును అమిత్ షా వక్రీకరించడం సరికాదు: రిటైర్డ్ జడ్జీలు

సుప్రీం తీర్పును అమిత్ షా వక్రీకరించడం సరికాదు: రిటైర్డ్ జడ్జీలు

న్యూడిల్లీ..ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మాజీ న్యాయమూర్తులు తప్పుబట్టారు.  సల్వాజుడుం తీర్పుతో నక్సలిజాన్ని  సమర్థించినట్లు కాదన్నారు. 

నక్సలిజానికి మద్దుతుగానే సుదర్శన్ రెడ్డి సల్వాజుడుం తీర్పు ఇచ్చారు.. సల్వాజుడుం ఉంటే 2020లోనే నక్సలిజం అంతమయ్యేదని అమిత్ షా ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను మొదట్లోనే ఖండించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి. 

హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను రిటైర్డ్ సుప్రీం, హైకోర్టు జడ్జీలు తీవ్రంగా ఖండించారు. అమిత్ షా తప్పుగా అర్థం చేసుకున్నారు.. సల్వాజుడుం తీర్పుతో నక్సలిజాన్ని సమర్ధించినట్లు కాదు అని.. సుప్రీం కోర్టు తీర్పును అమిత్ షా వక్రీకరించడం సరికాదన్నారు.