
- ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- తిరుపతిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్
- పరసా కస్తూరమ్మ 5వ వర్ధంతికి హాజరు
హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ మంత్రి పరసా రత్నం పేదల పక్షపాతి అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. సామాజిక సేవలో ఆయన ఎంతో ముందు ఉన్నారని చెప్పారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మోగా మెడికల్, బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి వివేక్ ప్రారంభించారు.
అనంతరం పరసా రత్నం తల్లి పరసా కస్తూరమ్మ 5వ వర్ధంతి స్మారక సభకు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రీగా హెల్త్ క్యాంప్, ట్రీట్మెంట్ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకా వెంకటస్వామి, పరసా రత్నం కలిసి పని చేశారని గుర్తు చేశారు. పేదలకు ఎంతో సేవ చేశారని, సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని వివరించారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గం నుంచి పరసా వెంకటరత్నం 3 సార్లు గెలిచారు. మంత్రిగా సేవలందించారు.