
ఆర్థిక ఇబ్బందులున్నా 50 వేల మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి ..మహిళలను ఆర్థికంగా నిలదొక్కకునేలా చేయడానికే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 50 వేల మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నామన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు రావడం ఆనందంగా ఉందన్నారు వివేక్. మేయర్ గద్వాల విజయలక్ష్మి అద్భుతంగా పని చేస్తుందన్నారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల కోసమే పని చేస్తుందన్నారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం,సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
మహిళ సంక్షేమానికి పెద్దపీట: సీతక్క
మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సీతక్క అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయి. రుణాలు తీసుకుని లక్షల మంది లబ్ది పొందుతున్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బ్యాంకులు, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించి, వడ్డీ ప్రభుత్వం కడుతోంది. 95 శాతం మహిళలు సక్రమంగా తీసుకున్న ఋణాలు చెల్లిస్తున్నారు.ఉచిత బస్సు పై బీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆడవాళ్ళు ఒక్క దగ్గర ఉండరు, కొట్టుకుంటారు అని మహిళలను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు లకు మహిళలను ఓనర్లుగా మార్చాము. పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. నగరంలో 35 చోట్ల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడిపిస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలపై బీఆర్ఎస్ నాయకులు చేసే దుష్ప్రచారం నమ్మొద్దు. గతంలో వాళ్ళు ఇచ్చిన బతుకమ్మ చీరల వల్ల బిడ్డలు, భార్యలు, బంధువులు కట్టుకోలేదు. బతుకమ్మ పండగకు కూడా కాంగ్రెస్ పైన విష ప్రచారం చేసి పాట విడుదల చేశారు. పండగ ను ఉపయోగించుకుని రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం: పొన్నం
ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందిరా గాంధీ అడుగుల్లో నడుస్తూ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. మహిళలందరికీ ఉంచితంగా బస్సు సౌకర్యం కల్పించాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలను ఉన్నతమైన స్థానంలో ఉంచేందుకు ప్రభుత్వం పనులు చేస్తుంది. మహిళల ఆశీర్వాదాలు మా ప్రభుత్వానికి ఉండాలి.