స్టూడెంట్స్ కు జర్మనీ, జపాన్ లాంగ్వేజ్ స్కిల్స్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

స్టూడెంట్స్ కు  జర్మనీ, జపాన్  లాంగ్వేజ్ స్కిల్స్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

దేశంలో ట్రెండ్ సెట్టర్ గా ఉండాలని పనిచేస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించేందుకు 
స్టూడెంట్స్ కు స్కిల్స్ నేర్పిస్తామని తెలిపారు. 46 ఏటీసీలు స్థాపిస్తున్నామని..  46 ఏటీసీ సెంటర్లలో 98 శాతం అడ్మిషన్లు అయ్యాయని చెప్పారు. ఫ్యాకల్టీని సమకూర్చాలని సీఎంను కోరామన్నారు.   

ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం అని అన్నారు వివేక్ .  టామ్ కామ్ సంస్థతో స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇచ్చేందుకు   కీలక ఒప్పందం కదుర్చుకున్నామని తెలిపారు.  సాఫ్ట్ స్కిల్స్ ను టామ్ కామ్ నేర్పిస్తుందన్నారు.  అక్కడ మనోళ్లకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండొద్దని ఉద్దేశంతో  జర్మనీ, జపాన్  లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పిస్తామని చెప్పారు మంత్రి వివేక్.