జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి : మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రహమత్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పిలుపు
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం రహమత్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తుందని, వీటన్నింటినీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనిసూచించారు. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైందని విమర్శించారు. మరోవైపు, యూసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడలో జరిగిన బూత్ లెవెల్ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో స్థానిక లీడర్లు బస్తీలోపర్యటిస్తూ , వారు ఎదుర్కొంటున్న తాగునీటి, డ్రైనేజీ, వీధి దీపాలు, సీసీ రోడ్లు వంటి సమస్యలను తెలుసుకొని తమ దృష్టికి తేవాలన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ రాని వారి లిస్టు, రేషన్ కార్డు అందని వారి లిస్టు తయారుచేసి తమకు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేసే బాధ్యత తమదే అని అన్నారు.